# BECAUSE EVERYONE HAS A STORY !

సేమ్ టు సేమ్..అదే రింగ్..??

గతంలో చంద్రబాబు ధరించిన ఓ రింగ్ గురించి అప్పట్లో తీవ్ర చర్చ నడిచింది.ఆ రింగ్ గురించి ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుకున్నారు.కానీ ఇపుడు మళ్ళీ చంద్రబాబు పెట్టుకున్న అచ్చం అలాంటి రింగ్ గురించే మళ్ళీ చర్చ నడుస్తోంది.అయితే…ఈ సారి జగన్ వేలికి ధరించిన రింగ్ గురించి చర్చ.రింగ్ దాదాపు సేమ్ టు సేమ్….కానీ మనిషి మారారంతే!! గతంలో చంద్రబాబు వెలికి పెట్టుకున్న ఇలాంటి రింగ్ పై వైసిపి అధినేత జగన్ సైటైర్లు వేశారు.చిప్ ఉండాల్సింది…వేలికి పెట్టుకున్న రింగ్‌‌కు కాదని….మెదడులో, గుండెలో’ అంటూ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబును ఉద్దేశించి జగన్ వెటకారంగా మాట్లాడారు.అయితే అచ్చం అలాంటి రింగ్‌గే ఇపుడు జగన్ తన చేతి వేలుకు పెట్టుకున్నారు.ప్రెస్ మీట్‌‌లో జగన్ తన ఎడమచేతి మధ్య వేలికి రింగ్ పెట్టుకుని కన్పించారు.జగన్ ఈ స్మార్ట్ రింగ్‌‌ను పెట్టుకొన్న ఫోటోలు,విజువల్స్ బయటకు వచ్చాయి.దీంతో జగన్ పెట్టుకున్న స్మార్ట్ రింగ్ పై టిడిపి వర్గాలు విమర్శిస్తున్నాయి.తమ అధినేత చంద్రబాబు స్మార్ట్ రింగ్ పెట్టుకున్నపుడు వ్యంగ్యంగా మాట్లాడిన జగన్… ఇపుడు అలాంటి స్మార్ట్ రింగ్‌ పెట్టుకోవడం ఏంటి ప్రశ్నిస్తున్నారు.కనీసం ఇలా అయినా ..తమ నాయకుడు చంద్రబాబు‌ను జగన్ ఫాలో అవుతుండటం మంచిదేగా అని అంటున్నారు.

ఈ స్మార్ట్ రింగ్ వల్ల ఏంటి ఉపయోగం..??

ఈ (SMART RING)స్మార్ట్ రింగ్…ఓ హెల్త్ మానిటర్ పరికరం.మైక్రో చిప్ సాయంతో ఇది పని చేస్తుంది.ఎవరైనా ఈ స్మార్ట్ రింగ్‌ను వెలికి ధరిస్తే చాలు.. ఈ చిప్ వారి ఆరోగ్య సమాచారాన్ని నిత్యం కంప్యూటర్‌కు పంపుతుంది.రోజులో ఎన్ని అడుగులు నడిచారు.ఆక్సీజన్ స్థాయిలు ఎలా ఉన్నాయి.గుండె కొట్టుకునే వేగం ఎలా ఉంది..?బీపీ ఎలా ఉంది.. రాత్రి ఏ సమయంలో నిద్రకు ఉపక్రమిస్తున్నారు.ఎన్ని గంటలకు నిద్ర లేస్తున్నారనే విషయాలను ఈ చిప్ మానిటర్ చేస్తుంది.నిరంతరం హెల్త్‌ని గమనిస్తూ.. ఆ వివరాల్ని యాప్ ద్వారా మొబైల్‌కి పంపిస్తుంది. దాంతో ఆరోగ్యానికి సంబంధించి చాలా విషయాలు ఎప్పటికప్పుడు స్మార్ట్ రింగ్ పెట్టుకున్న వారికి తెలిసిపోతాయి.దీన్ని బట్టి వైద్యులు.. ఈ స్మార్ట్ రింగ్‌ పెట్టుకున్న వారికి తమ సలహాలు,సూచనలు ఇస్తారు.ఆరోగ్యం విషయంలో చేసే తప్పిదాలను సరి చేసుకోవడానికి ఇది అవకాశం కల్పిస్తుంది.ఈ స్మార్ట్ రింగ్ ధర బ్రాండింగ్‌, బిల్డ్ కాల్విటిని బట్టి వేలల్లో ఉంటుంది.సైజ్ 6 నుంచి 13 వరకూ ఉంటుంది.ఈ స్మార్ట్ రింగ్ బరువు…6 గ్రాముల బరువు.5 కలర్స్‌లో లభిస్తుంది. ఇది బ్లూటూత్ ద్వారా మొబైల్ యాప్‌కి కనెక్ట్ అవుతుంది.అలాగే ఆండ్రాయిడ్ ద్వారా పనిచేస్తుంది.ఈ రింగ్ వైర్‌లెస్ ఛార్జర్, యూజర్ మాన్యువల్ కూడా ఇస్తారు. దీని బ్యాటరీ యావరేజ్ లైఫ్ 7 రోజులు ఉంటుంది. ఇది ఛార్జింగ్ అవ్వడానికి 60 నిమిషాలు తీసుకుంటుంది. ఇందులో ప్రత్యేక బ్యాటరీలు ఉంటాయి.అవి కూడా రింగులోనే ఉంటాయి.రింగ్ వేలికి ఉన్నప్పుడు.. స్నానం చెయ్యవచ్చు, స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టవచ్చు. అయినా ఇది పాడైయ్యే అవకాశం లేదు.దీని సెన్సార్లు.. వేలి సిగ్నల్స్‌ని గ్రహిస్తాయి. దీనికి ప్రీమియం టైటానియం మెటల్ వాడటం వల్ల తుప్పుపట్టదు.ఇది ఆండ్రాయిడ్ ఫోన్లతోపాటూ.. యాపిల్ ఐఫోన్లతో కూడా పనిచేస్తుంది. ఈ రింగ్‌ పంపే మొబైల్ యాప్ AI ఆధారంగా పనిచేస్తుంది.

Hot this week

ఇరాన్.. అమెరికాకు వార్నింగ్ ఇస్తుందా??

ఇరాన్ అణు స్థావరాల పై అమెరికా దాడులకు..ప్రతిగా ఇరాన్ ప్రతీకారానికి ...

ఇరాన్‌ను టార్గెట్ చేసిన అమెరికా !!

ఇజ్రాయెల్,ఇరాన్(ISREAL,IRAN)మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది.పరస్పరం దాడులతో రెండు...

నా వీర్యదానంతో పుట్టిన 100 మంది పిల్లలకు ఆస్తిని ఇచ్చేస్తా…

మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ (Telegram) సీఈఓ పావెల్ దురోవ్ (CEO Pavel...

దెబ్బ తిన్న బ్లాక్ బాక్స్..దర్యాప్తు ముందుకు సాగేనా.. ??

అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన ఘోర విమాన ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి...

ఇరాన్ సుప్రీం హీరో.. వన్ అండ్ ఓన్లీ ఖమేనీని

ఇరాన్,ఇజ్రాయెల్ దేశాల మధ్య ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం… ఎటు దారి తీస్తుందోనని...

Topics

ఇరాన్.. అమెరికాకు వార్నింగ్ ఇస్తుందా??

ఇరాన్ అణు స్థావరాల పై అమెరికా దాడులకు..ప్రతిగా ఇరాన్ ప్రతీకారానికి ...

ఇరాన్‌ను టార్గెట్ చేసిన అమెరికా !!

ఇజ్రాయెల్,ఇరాన్(ISREAL,IRAN)మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది.పరస్పరం దాడులతో రెండు...

నా వీర్యదానంతో పుట్టిన 100 మంది పిల్లలకు ఆస్తిని ఇచ్చేస్తా…

మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ (Telegram) సీఈఓ పావెల్ దురోవ్ (CEO Pavel...

దెబ్బ తిన్న బ్లాక్ బాక్స్..దర్యాప్తు ముందుకు సాగేనా.. ??

అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన ఘోర విమాన ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి...

ఇరాన్ సుప్రీం హీరో.. వన్ అండ్ ఓన్లీ ఖమేనీని

ఇరాన్,ఇజ్రాయెల్ దేశాల మధ్య ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం… ఎటు దారి తీస్తుందోనని...

AIతో..మీడియా సంస్థలకు కష్టకాలం!

ప్రపంచ దేశాల్లో లాగే భారత దేశంలో సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తోంది.ఇటీవల...

భారత నౌకాదళంలో మరో అస్త్రం….INS అర్నాలా!

భారత నౌకాదళం INS అర్నాలా‌ను, దేశంలోనే మొట్టమొదటి" షాలో వాటర్ క్రాఫ్ట్‌గా…...

ఇరాన్‌లో సోషల్ మీడియా పై ఆంక్షలు??

ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.అయితే ఇరాన్‌లో ప్రస్తుత నెలకొన్న...

Related Articles

Popular Categories