ఇజ్రాయెల్,ఇరాన్(ISREAL,IRAN)మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది.పరస్పరం దాడులతో రెండు దేశాలు..తమ ఉనికిని కాపాడుకునేందుకు పోరాటం చేస్తూనే ఉన్నాయి.మరో వైపు అమెరికా ఇజ్రాయెల్‌కు మద్దతును ఇస్తూ…ఇరాన్‌ను తక్షణమే యుద్ధం ఆపాలని హెచ్చరిస్తుంది.అయితే ఇరాన్ అమెరికా ఇస్తూనే వార్నింగ్‌లను పట్టించుకోకుండా ఇజ్రాయెల్ పై దాడులు చేస్తోంది.దీంతో అమెరికా…ఇరాన్‌లో మూడు అణు కేంద్రాల పై లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది.అందులో ఫోర్డో అణు కేంద్రం కూడా ఉంది.
ఈ రహస్య కేంద్రం 300 అడుగుల లోతులో పర్వతాల్లో దాగి ఉండటంతో సాధారణ ఆయుధాలకు అందకుండా ఉండేది. కానీ అమెరికా బంకర్ బస్టింగ్ బాంబులను వదలడంతో అది దెబ్బతిన్నది.ఇరాన్ పై బాంబులతో దాడులు చేసిన అమెరికా.. ఇప్పుడు ఇజ్రాయెల్‌తో పాటు చేరి…ఇరాన్ పై దాడులు మొదలుపెట్టింది.అమెరికా దీన్ని అధికారికంగా ప్రకటించింది.పైగా ఈ యుద్ధాన్ని ముగించాల్సిందేనని అమెరికా గట్టి పట్టుదలతో ఉంది.
ఇరాన్‌లోని ఫోర్డో, నాటాంజ్, ఇస్ఫహాన్..మూడు అణు కేంద్రాల పై దాడి పూర్తి చేసామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్….తన Truth Social ఖాతాలో పేర్కొన్నారు. ముఖ్యంగా ఫోర్డో పై బాంబుల వర్షం కురిపించమని తెలిపారు.ఇరాన్ పై బాంబింగ్ చేసిన విమానాలు సురక్షితంగా తిరిగి తమ దేశ గగనతలలోకి వచ్చాయని ట్రంప్ చెప్పారు.ఇరాన్ కూడా ఈ దాడులను ధృవీకరించింది. వారి అణు భద్రతా సంస్థ ప్రకారం…కాలుష్య సూచనలు ఏవీ నమోదు కాలేదని… ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేదు” అని చెప్పింది.
ఇరాన్‌కు ఫోర్డో ఎందుకు అంత ముఖ్యమైనది?..ఆమెరికా ఎందుకు టార్గెట్ చేసింది??
ఫోర్డో ప్లాంట్ ఇరాన్‌లోని పవిత్ర నగరం క్వోమ్ సమీపంలో ఉంది.ఫోర్డో… భూమికి సుమారు 300 అడుగుల లోతులో ఉంది.ఈ కేంద్రం గురించి 2009లో ప్రపంచానికి తెలిసింది. మొదట్లో ఇది ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నియంత్రణలో ఉన్న క్షిపణి కేంద్రంగా ఉండేది.ఫోర్డో ఉనికి ప్రపంచానికి తెలిసిన తర్వాత..రష్యా,చైనా నుంచి ఇరాన్‌ను ఓ హెచ్చరిక వచ్చింది.ఈ రెండు దేశాలు ఇరాన్‌కు మిత్ర దేశాలు.
ఇరాన్‌లోకి….ఇజ్రాయెల్ చొరబడి దొంగిలించిన ఇరానియన్ డాక్యుమెంట్ల ప్రకారం… ఫోర్డోలో ప్రధాన హాళ్లు భూమికి 80 నుండి 90 మీటర్ల లోతులో ఉన్నాయి.ఇది ఇజ్రాయెల్ వద్ద ఉన్న ఏ ఆయుధానికి అందదని ఇజ్రాయెల్ గుర్తించింది.
ప్రపంచ అణు శక్తి సంస్థ (IAEA) ప్రకారం, ప్రస్తుతం ఫోర్డోలో 2,700 సెంట్రిఫ్యూజ్‌లు ఉన్నాయి. ఇవి యురేనియంను 60 శాతం వరకు శుద్ధి చేస్తున్నాయి – ఇది అణు బాంబులకు అవసరమైన 90 శాతం స్థాయికి కేవలం ఒక అడుగు మాత్రమే.
ISIS ఆలోచన ప్రకారం…. ఫోర్డోలో ఉన్న 60 శాతం శుద్ధి చేసిన యురేనియంను 233 కిలోల అస్త్రస్థాయి యురేనియంగా మూడు వారాల్లో మార్చవచ్చని తేల్చింది.ఇది 9 అణు బాంబులకు సరిపోతుంది.
ఫోర్డో అనేది ఇరాన్ అణు లక్ష్యాలకు ప్రతీక.ఒక వేళ…ఫోర్డోను ధ్వంసం చేయలేకపోతే ఇరాన్ అస్త్ర సామర్థ్యాన్ని పూర్తిగా నిర్మూలించలేరని అమెరికా అభిప్రాయ పడుతోంది
ఫోర్డో మోస్ట్ పవర్ ఫుల్…
ఫోర్టోను ఎందుకు టచ్ చేయలేరు??
ఇరాన్‌లోని ఫోర్డో భూగర్భంలో 80 నుండి 300 అడుగుల లోతులో నిర్మించబడింది.దీన్ని సాధారణ బాంబులు లేదా ఆయుధాలు అసలు తాకలేవు.ఇది పర్వతపు గర్భంలో దాగి ఉండటంతో…ఇది ఎంతో రక్షణాత్మకమైంది.అలాగే అత్యంత కఠినమైన లక్ష్యం.అందుకే ఎలాంటి దేశమైన ఫోర్డో పై దాడి చేయడం అంత ఈజీ కాదు.ఇరాన్… ఇజ్రాయెల్ తమ అణు ప్రోగ్రామ్‌లను లక్ష్యంగా తీసుకుంటుందని ముందే ఊహించి…పక్క ప్లాన్‌తోనే ఫోర్డోను లోతైన పర్వతంలో నిర్మించారని… జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీకి చెందిన వాలీ నస్ర్ తెలిపారు.ఇది గగనతల దాడుల నుంచి రక్షణగా రష్యా రూపొందించిన S-300 సిస్టమ్‌తో కూడిన సురక్షితమైన వ్యవస్థతో నిర్మించింది.దీని పై వరుసగా బాంబింగ్ చేయగల సామర్థ్యం చాలా దేశాలకు లేదని తెలుస్తోంది.RUSI అనే UK సంస్థ ప్రకారం… గగనతల నుండి ఫోర్డోను పూర్తిగా ధ్వంసం చేయడం ఇజ్రాయెల్‌కి అసాధ్యం.అమెరికా సాయంతో మాత్రమే ఇది సాధ్యమవుతుంది.ఆందుకే ఇజ్రాయెల్….ఇరాన్ పై దాడి చేసేందుకు అమెరికా సహకారం కోరింది.
ఇరాన్ ఫోర్డో పై అమెరికా ఎందుకు దాడి చేసింది?….
ఇజ్రాయెల్ అధికారుల ప్రకారం… ఫోర్డోను ధ్వంసం చేయకపోతే…ఇరాన్ అణు లక్ష్యాలను నిలిపేసే పరిస్థితి లేదు.ఫోర్డో లోతులో ఉండటంతో…. ఇజ్రాయెల్ వద్ద ఉన్న ఆయుధాలకు ఫోర్డో పై దాడి చేసే సామర్థ్యం లేదు.అందుకే ఇజ్రాయెల్ అమెరికా సాయం కోరింది.అమెరికా వద్ద ఉన్నGBU-57 Massive Ordnance Penetrator అనే బంకర్ బస్టింగ్ బాంబ్‌కు మాత్రమే ఈ సామర్థ్యం ఉంది.దీని ప్రత్యేకతలు….
20 అడుగుల పొడవు
30,000 పౌండ్ల బరువు
61 మీటర్ల లోతులోకి చొచ్చుకుపోతుంది
దీన్ని వదిలే విమానం: B-2 స్టెల్త్ బాంబర్
RUSI నివేదిక ప్రకారం..ఈ బాంబును కూడా ఒకే చోట పలు సార్లు వేయాల్సి వస్తుంది.CNN సైనిక నిపుణుల ప్రకారం…ఇజ్రాయెల్ ఫోర్డో టన్నెల్ ప్రవేశాలు, వెంటిలేషన్ వ్యవస్థను ధ్వంసం చేయగలదు. అలాగే ఎలక్ట్రిక్ సరఫరాను నాశనం చేస్తే, ఆ ప్లాంట్ మళ్లీ పనిచేయడానికి నెలలు పడుతుందని తెలుస్తోంది.అయితే ఫోర్డో ఇంకా పూర్తిగా ధ్వంసం కాలేదు.దీంతో ఇజ్రాయెల్‌కు ఫోర్డో సమస్య ఇంకా అలాగే మిగిలిపోయింది.అమెరికాతో కలిసి ఇజ్రాయెల్…ఇరాన్ ఫోర్డో పై చేసిన దాడితో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఓ చర్చ నడుస్తోంది.యుద్దం ముగిసిందా..లేక మొదలైందా?? అన్నదే ఇపుడు అసలు ప్రశ్న!!