వాట్సాప్ ఓ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాబోతుంది.ఈ కొత్త ఫీచర్‌తో ఇక పై అందరి స్మార్ట్ ఫోన్స్‌లో డేటా ఆదా అవుతుంది.సాధారణంగా వాట్సాప్ లో ఫోటోలు,వీడియోలు, డాక్యుమెంట్లు షేర్ చేస్తున్నప్పుడు, ఫోన్ స్టోరేజ్ త్వరగా నిండిపోతూ ఉంటుంది. ముఖ్యంగా…ఆటో-డౌన్లోడ్ ఆప్షన్ వల్ల హెచ్ క్వాలిటీ ఫోటోలు, వీడియోలు ఆటోమేటిక్‌గా డౌన్ లోడ్ అవుతాతుంటాయి.దీని వల్ల ఫోన్
స్టోరేజ్ ఎక్కువై ఫోన్ స్లో అవుతుంటుంది.అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి వాట్సాప్ ఓ కొత్త ఫీచర్‌ను ప్రవేశం పెట్టబోతోంది. ‘డౌన్లోడ్ క్వాలిటీ’ అనే కొత్త ఈ ఫీచర్‌తో మీరు మీ ఫోన్‌కు వచ్చిన మీడియా ఫైల్స్‌ను డౌన్లోడ్ చేసే ముందు వాటి క్వాలిటీని మీకు నచ్చిన విధంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అంటే…మీకు హెచ్డీ లేదా ఎస్డీ… ఏ క్వాలిటీలో కావాలనుంటే ఆ క్వాలిటీలో ఫోటోలు వీడియోలు డౌన్ లోడ్ చేసుకొనే అవకాశం ఉంటుంది.ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ చాలా వాట్సాప్ గ్రూప్‌లో మెయింటెయిన్ చేస్తున్నారు.దీంతో వాట్సాప్ గ్రూప్స్ మెయింటెయిన్ చేసే వారికి స్టోరేజ్ అన్నది పెద్ద సమస్యగా మారింది.రోజూ వందల కొద్దీ మీడియా ఫైల్స్ వస్తుంటాయి. హెచీ క్వాలిటీలో ఫైల్స్ ఆటోమేటిక్‌గా డౌన్లోడ్ అవుతుంది.దీంతో ఫోన్ స్టోరేజ్ త్వరగా నిండిపోతుంది.బల్క్‌గా వచ్చినప్పుడు స్టోరేజ్ సమస్య తీవ్రమవుతుంది.దీంతో చాలా మంది స్టోరేజ్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు.అయితే వాట్సాప్ ఈ సమస్యకు ఓ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.WABetaInfo తాజాగా ఈ ఫీచర్ గురించి వెల్లడించింది.ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.25.18.11తో యూజర్లు డౌన్లోడ్ చేసే మీడియా ఫైల్స్ క్వాలిటీని ముందుగానే ఎంచుకోవచ్చు. సెట్టింగ్స్ > స్టోరేజ్ అండ్ డేటా > ఆటో-డౌన్లోడ్ క్వాలిటీకి వెళ్లి, హెచ్డీ లేదా ఎస్డీ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకునే అవకాశం కల్పించింది.దీంతో ఇక పై మీ ఫోన్లో ఎంత స్టోరేజ్ ఉందో తెలుసుకుని అందుకు అనుగుణంగా మీ అవసరాలను బట్టి మీరు ఫోటోలు, వీడియోలను హెచ్డీ లేదా ఎస్డీ ఫార్మాట్లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా యూజర్ల కోసం టేస్టింగ్ దశలో ఉంది.టెస్టింగ్ సక్సెస్ అయితే రాబోయే అప్డేట్స్లో ఇది అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే…మీ డేటాను కంట్రోల్ చేయడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే…మీ ఫోన్ స్టోరేజ్ జీవితకాలాన్ని ఇది పొడిగిస్తుంది.ఈ ఫీచర్ అపరిమితంగా ఫోటోలు, వీడియోలు డౌన్ లోడ్ చేసుకొనే వారికి ఓ ఉత్తమ పరిష్కారమని వాట్సప్ చెబుతోంది.ఇది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి మెరుగైన మెసేజింగ్ అనుభవాన్ని అందిస్తుందని వాట్సప్ భావిస్తోంది.

వాట్సప్‌లో ఈ కొత్త ఫీచర్ సూపర్…ఇది మీ ఫోన్ డేటా వినియోగాన్ని తగ్గిస్తుంది!!
Popular Categories