అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మరో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నారు.ఇప్పటికే పలు వ్యాపార రంగాల్లో ఉన్న ట్రంప్…తాజాగా ఇపుడు మొబైల్ రంగంలోకి అడుగు పెట్టబోతున్నారు.ఇప్పటికే ట్రంప్ స్టీక్స్,ట్రంప్ ఎయిర్ లైన్స్,ట్రంప్ యూనివర్సిటీ,ట్రంప్ వాటర్ పేరుతో పలు వ్యాపారాలు చేస్తున్న ట్రంప్…ఈ సారి తన ఫ్యామిలీ మెంబెర్స్‌తో ద్వారా ఓ కొత్త మొబైల్‌ను లాంచ్ చేయబోతున్నారు.ట్రంప్ మొబైల్ పేరుతో సెల్‌ఫోన్ సర్వీస్‌ను ప్రారంభించినట్లు ట్రంప్ కంపెఊ ప్రతినిధులు ప్రకటించారు.అయితే ఈ సెల్ ఫోన్ సర్వీస్… ట్రంప్ అభిమానుల కోసం ప్రత్యేకంగా ప్రారంభించినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.ఈ సెల్ ఫోన్ సర్వీస్ గురించి న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్స్‌లో ట్రంప్ ఇద్దరు కుమారులు జూనియర్ డోనాల్డ్ ట్రంప్,ఎరిక్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు.ఇక పై వీరిద్దరే ఈ బిజినెస్‌ను మెయింటెయిన్ చేస్తున్నారని కంపెనీ ప్రతినిధులు చెప్పారు.అలాగే ఈ ట్రంప్ మొబైల్ చాలా ప్రత్యేకతలు ఉన్నాయని….ఈ ఫోన్స్ అన్నీ యునైటెడ్ స్టేట్స్ తయారవుతాయని ప్రకటించారు.అయితే ట్రంప్ వెబ్ సైట్‌లో మాత్రం…..ట్రంప్ మొబైల్ బ్రాండ్ మాత్రమే తమదని…దాని ఉత్పత్తులు,సంబంధిత సేవలు అన్నీ కూడా వేరే కంపెనీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అయితే ట్రంప్ మొబైల్ అమెరికాలోని ఉన్న మూడు ప్రధాన నెట్ వర్క్‌కు సమానంగా పోటీ ఇస్తుందని చెబుతున్నారు.కానీ ఇప్పటికే అమెరికా మొబైల్ మార్కెట్‌లో ఉన్న Verizon,AT&T,T-Mobile లాంటి ప్రధాన కంపెనీలకు ట్రంప్ మొబైల్ సర్వీస్ పోటీ ఇస్తుందన్నది అనుమానమే అని మార్కెట్ నిపుణులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఎందుకంటే ట్రంప్‌కు అనేక వ్యాపారాలు ఉన్న… ఇప్పటి వరకు ఏవి కూడా స్థిరంగా తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించలేకపోయాయని నిపుణులు అంటున్నారు.ఇటీవల ట్రంప్ ఫ్యామిలీ $TRUMP పేరుతో మేయ్ కాయిన్ క్రిప్టో కరెన్సీను ప్రవేశపెట్టింది.ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడి స్థానంలో ఉన్న ట్రంప్ 200మంది డొనర్లుకు లగ్జరీగా డిన్నర్ ఏర్పాటు చేయడం పై చాలా విమర్శలు వచ్చాయి.తన అధ్యక్షుడి హోదాను అడ్డుపెట్టుకుని తన వ్యాపార రంగాన్ని విస్తరించుకునేందుకు ట్రంప్ ప్లాన్ చేస్తున్నాడని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.ట్రంప్…ఓ అధ్యక్షుడిగా ఉంటూ ఇలా వ్యాపారాలు చేయడం పై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.ఇప్పటికే ఫోర్బ్స్ అంచనా ప్రకారం ట్రంప్ నెట్ వర్క్ విలువ సుమారు $5.3బిలియన్లు. ఇందులో అధిక శాతం క్రిప్టో కరెన్సీ పెట్టుబడులే ప్రధాన ఆదాయ మార్గంగా ఉందని ఫోర్బ్స్ పేర్కొంది.పైగా ఇదంతా ట్రంప్ తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేస్తున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇపుడు కొత్తగా ట్రంప్ మొబైల్ సర్వీస్ పేరుతో ఓ వ్యాపారంలోకి అడుగుపెట్టడం పై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ట్రంప్ ఫ్యామిలీ కొత్త తెచ్చిన ట్రంప్ మొబైల్ సర్వీస్ ఓ బ్రాండ్‌గా అమెరికా మార్కెట్‌లో నిలదొక్కుంటుందా లేదా ట్రంప్ ఇతర వ్యాపారాల లాగా ఓ ఎక్స్‌పరిమెంట్‌గా మిగిలిపోతుందా అన్నది త్వరలో తేలబోతోంది.
Popular Categories