# BECAUSE EVERYONE HAS A STORY !

నా వీర్యదానంతో పుట్టిన 100 మంది పిల్లలకు ఆస్తిని ఇచ్చేస్తా…

మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ (Telegram) సీఈఓ పావెల్ దురోవ్ (CEO Pavel Durov) చేసిన సంచలన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియా‌లో వైరల్ అవుతున్నాయి.ప్రపంచవ్యాప్తంగా 100 మందికి పైగా పిల్లలకు తాను బయోలాజికల్‌గా తండ్రినని గతంలో ప్రకటించారు పావెల్.అయితే ఇపుడు ఆ పిల్లలందరికీ తన సంపదను పంచేస్తానంటూ ప్రకటన చేసి మరోసారి వార్తల్లో నిలిచారు.15 ఏళ్ల పాటు తాను చేసిన వీర్యదానంతో ప్రపంచవ్యాప్తంగా 12 దేశాల్లో 100 మంది పిల్లలు జన్మించినట్లు గతేడాది జులైలో ప్రకటించిచారు.ఈ ప్రకటన పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.అలాగే ఆయన.. మరో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తాను ఇటీవలే వీలునామా రాశానని,అందులో తన సంతానం గురించి కూడా చెప్పారు. తాను సహజంగా జన్మనిచ్చిన సంతానంతో పాటు ఈ 100 మంది పిల్లలకు కూడా తన ఆస్తిలో సమాన హక్కు ఉంటుందని వెల్లడించారు. దాదాపు 20 బిలియన్ డాలర్ల తన సంపదను వీరందరికీ సమానంగా పంచుతానని తన వీలునామాలో పేర్కొన్నట్లు చెప్పారు.అయితే,ఈ సంపదను 30 ఏళ్ల వరకు వారు పొందలేరని ఓ షరతు విధించారు.తన పిల్లలు స్వతంత్రంగా జీవించేలా ఎదగాలని కోరుకుంటున్నట్లు పావెల్ తెలిపారు.వివాహం కానప్పటికీ తనకు ముగ్గురు సహజీవన భాగస్వాములు ఉన్నారని, వారికి ఆరుగురు సంతానం అని పావెల్ తెలిపారు.తన జీవితంలో ఎంతోమంది శత్రువులు ఉన్నట్లు చెప్పారు. అందుకే, 40 ఏళ్ల వయసులోనే వీలునామా రాయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ గా మారింది.

పావెల్ దురోవ్ గురించి…..

ఆయన అప్రామాణిక జీవనశైలితో పాటు, బాహాటంగా మాట్లాడే వ్యక్తిగా కూడా పాపులర్‌గా అయ్యారు.ప్రసుత్తం టెలిగ్రామ్‌లో ఆయనకు 11.1 మిలియన్‌ ఫాలోవర్స్ ఉన్నారు. తరచూ తన ఫిట్‌నెస్‌ రూటీన్‌ గురించి పావెల్ దురోవ్ పోస్టులు చేస్తూ ఉంటారు.రోజూ వ్యాయామం క్రమం తప్పకుండా చేసే పావెల్ దురోవ్… ఆల్కహాల్‌, కాఫీ, టీ వంటి తాగడుఇటీవల ఈస్టర్ సందర్భంగా షర్ట్ లేకుండా ఫొటో పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు.ఆయన నాయకత్వంలో టెలిగ్రామ్ ప్రపంచంలోనే అతిపెద్ద మెసేజింగ్‌ యాప్‌లలో ఒకటిగా మారింది. ప్రస్తుతం టెలిగ్రామ్‌కు ఒక బిలియన్‌ యాక్టివ్‌ యూజర్స్ ఉన్నారు.అయితే దురోవ్ ౠపుడు వివాదాలకు దగ్గరగా ఉంటారు. గత సంవత్సరం ఫ్రాన్స్‌ ప్రభుత్వం టెలిగ్రామ్‌లో జరిగిన నేరాల పై ఆయన పై కేసు నమోదు చేసింది. దీనిపై దురోవ్ గట్టి ఖండన చేశారు.రష్యాలో పుట్టిన దురోవ్ …డిజిటల్ ప్రైవసీ, వ్యక్తిగత స్వేచ్ఛకు పరోక్షంగా పోరాటం చేస్తున్న వాడిగా బాగా గుర్తింపు పొందాడు.ఇప్పుడు తాజాగా తన వీర్యంతో పుట్టిన 100మంది పిల్లలకు తన యావదాస్తిని ఇచ్చేస్తానని ప్రకటన చేసి మరోసారి తన ప్రత్యేకతకు చాటుకున్నారు పావెల్ దురోవ్.

Hot this week

ఇరాన్.. అమెరికాకు వార్నింగ్ ఇస్తుందా??

ఇరాన్ అణు స్థావరాల పై అమెరికా దాడులకు..ప్రతిగా ఇరాన్ ప్రతీకారానికి ...

ఇరాన్‌ను టార్గెట్ చేసిన అమెరికా !!

ఇజ్రాయెల్,ఇరాన్(ISREAL,IRAN)మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది.పరస్పరం దాడులతో రెండు...

సేమ్ టు సేమ్..అదే రింగ్..??

గతంలో చంద్రబాబు ధరించిన ఓ రింగ్ గురించి అప్పట్లో తీవ్ర చర్చ...

దెబ్బ తిన్న బ్లాక్ బాక్స్..దర్యాప్తు ముందుకు సాగేనా.. ??

అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన ఘోర విమాన ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి...

ఇరాన్ సుప్రీం హీరో.. వన్ అండ్ ఓన్లీ ఖమేనీని

ఇరాన్,ఇజ్రాయెల్ దేశాల మధ్య ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం… ఎటు దారి తీస్తుందోనని...

Topics

ఇరాన్.. అమెరికాకు వార్నింగ్ ఇస్తుందా??

ఇరాన్ అణు స్థావరాల పై అమెరికా దాడులకు..ప్రతిగా ఇరాన్ ప్రతీకారానికి ...

ఇరాన్‌ను టార్గెట్ చేసిన అమెరికా !!

ఇజ్రాయెల్,ఇరాన్(ISREAL,IRAN)మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది.పరస్పరం దాడులతో రెండు...

సేమ్ టు సేమ్..అదే రింగ్..??

గతంలో చంద్రబాబు ధరించిన ఓ రింగ్ గురించి అప్పట్లో తీవ్ర చర్చ...

దెబ్బ తిన్న బ్లాక్ బాక్స్..దర్యాప్తు ముందుకు సాగేనా.. ??

అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన ఘోర విమాన ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి...

ఇరాన్ సుప్రీం హీరో.. వన్ అండ్ ఓన్లీ ఖమేనీని

ఇరాన్,ఇజ్రాయెల్ దేశాల మధ్య ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం… ఎటు దారి తీస్తుందోనని...

AIతో..మీడియా సంస్థలకు కష్టకాలం!

ప్రపంచ దేశాల్లో లాగే భారత దేశంలో సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తోంది.ఇటీవల...

భారత నౌకాదళంలో మరో అస్త్రం….INS అర్నాలా!

భారత నౌకాదళం INS అర్నాలా‌ను, దేశంలోనే మొట్టమొదటి" షాలో వాటర్ క్రాఫ్ట్‌గా…...

ఇరాన్‌లో సోషల్ మీడియా పై ఆంక్షలు??

ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.అయితే ఇరాన్‌లో ప్రస్తుత నెలకొన్న...

Related Articles

Popular Categories