భారతదేశం…ఈ పేరు చేబితినే ప్రపంచ దేశాలకు గుర్తుకు వచ్చేది స్థానిక సంస్కృతీ సంప్రదాయలు….భారత్‌లో ఒక్కో ప్రాంతం వారు ఒక్కో సంప్రదాయం, ఆచార వ్యవహారాలు పాటిస్తుంటారు.ఒక్కో ప్రాంతం వారు ఒక్కో సంప్రదాయాన్ని పాటిస్తున్నారు.అయితే పక్క ప్రాంతాలవారు ఆచరించే సంప్రదాయాలు చాలా వింతగా అనిపిస్తూ ఉంటాయి.ఆశ్చర్యం కూడా కలిగిస్తాయి.అయితే ప్రస్తుత టెక్నాలజీ యుగంలోనూ ఓ వింత ఆచారాన్ని మధ్యప్రదేశ్‌లోని ఓ గ్రామంలో ఇప్పటికీ తూచ తప్పకుండా పాటిస్తున్నారు అంటే మీరు నమ్ముతారా??. పరాగ్ అనే ఈ సంప్రదాయాన్ని ఆ గ్రామంలోని వారంతా ఇప్పటికీ పాటిస్తున్నారంటే ఆచారాల వ్యవహారాల పట్ల వారికి ఉన్న గౌరవం చాలా గొప్పదని వారిని మెచ్చుకోవాల్సిందే!అసలు పరాగ్ గ్రామస్థులంతా పాటిస్తున్న సంప్రదాయం ఏంటి??ఎందుకు ఆ ఆచారాన్ని కచ్చితంగా పాటిస్తున్నారు అంటే దీని వెనుక చాలా పెద్ద కారణమే ఉందని పరాగ్ గ్రామస్థులు చెబుతున్నారు.మధ్యప్రదేశ్ బుందేల్ ఖండ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో పరాగ్ అనే ఓ సంప్రదాయాన్ని గత కొన్ని శతాబ్దాలుగా అక్కడి గ్రామస్థులంతా పాటిస్తున్నారు.ఈ ఆచారం ప్రకారం….గ్రామంలో ఎవరైనా హత్య, గోవధ వంటి నేరాలకు పాల్పడితే గ్రామంలో మొత్తం వివాహాలు ఆగిపోవాల్సిందే!! ఈ సంప్రదాయాన్ని చూట్టూ పక్కల చాలా గ్రామాలు పాటిస్తున్నాయి.దీంతో చాలా గ్రామాల్లో పెళ్ళిళ్లు జరగలేదు.అంటే వారు పెళ్ళిళ్లు చేసుకోలేదని కాదు.వారు ఉంటున్న గ్రామం పెళ్ళి చేసుకోలేదు అంతే!వారు తమ గ్రామంలో కాకుండ బయట పెళ్లిళ్లు చేసుకుంటారు.అయితే గ్రామంలో ఆర్థిక స్తోమత లేని చాలా మందికి ఇది ఇబ్బందిగా మారింది.తాము ఉంటున్న గ్రామంలో ఎవరైనా సరే….నేరం చేస్తే ఈ సంప్రదాయాన్ని కచ్చితంగా పాటించాల్సిందే!!
Popular Categories