# BECAUSE EVERYONE HAS A STORY !

ఇరాన్.. అమెరికాకు వార్నింగ్ ఇస్తుందా??

ఇరాన్ అణు స్థావరాల పై అమెరికా దాడులకు..ప్రతిగా ఇరాన్ ప్రతీకారానికి దిగింది.అమెరికా ఇరాన్ పై బాంబర్స్‌తో దాడి చేసిన మూడు గంటల లోపే ఖోరంషహర్-4 క్షిపణిని ఇజ్రాయెల్‌ పై ప్రయోగించింది.మొదట అమెరికా ఇరాన్ అణు స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయగా..ఇరాన్ తేహ్రాన్ ఖోరంషహర్-4 క్షిపణిని ఇజ్రాయెల్‌ పై ప్రయోగించింది.

ఖైబర్ మిస్సైల్‌ అనే ఈ క్షిపణి…ఇరాన్ అభివృద్ధి చేసిన అతి పెద్ద రాకెట్. దీని శ్రేణి 2,000 కిలోమీటర్లు కాగా…దీని ద్వారా 1,800 కిలోల బరువున్న బహుళ వార్‌హెడ్‌లను మోయగల సామర్థ్యం ఈ రాకెట్ ఉంది.

కొద్ది గంటల్లోనే దాడులు…ప్రతీదాడులు ….

అమెరికా….ఇరాన్ దేశంలోని తేహ్రాన్ అణు లక్ష్యాలను కేంద్రంగా చేసుకున్న మూడు ప్రధాన కేంద్రాల పై దాడులు చేసింది . అనంతరం కొన్ని గంటల తర్వాత…ఇరాన్, ఇజ్రాయెల్ పై మిస్సైల్ దాడులకు దిగింది.ఇరాన్ ఇటీవల కాలంలో ఎప్పుడూ ఇంత పెద్ద స్థాయిలో దాడులు చేసిన సందర్భాలు లేవు.ఇరాన్ వైమానిక దాడులలో గాయపడిన 86 మంది ఇజ్రాయెల్ దేశస్థులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.ఈ దాడులు బెన్ గురియన్ ఎయిర్‌పోర్ట్, బయోలాజికల్ రీసెర్చ్ సెంటర్, లాజిస్టిక్ బేస్‌లు అలాగే కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నాయి.IRNA న్యూస్ ఏజెన్సీ ప్రకారం..ఇరాన్ ఇప్పటి వరకు మొత్తం 40 క్షిపణులు ప్రయోగించబడ్డాయి.ఈ క్షిపణుల ప్రయోగంతో… ఇజ్రాయెల్‌లో చాలా ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. షెల్టర్లలో ఉన్నవారంతా సురక్షితంగా ఉన్నారు.ఆస్తి నష్టం చాలా ఎక్కువగానే జరిగింది.ఇరాన్… పారామిలిటరీ విభాగమైన రివల్యూషనరీ గార్డ్ (IRGC) ప్రకారం, ఈ దాడులలో వినియోగించిన అనేక క్షిపణుల్లో ఖోరంషహర్-4 కూడా ఒకటి. ఖైబర్ మిస్సైల్ అని పిలవబడే ఈ క్షిపణి పేరును… 7వ శతాబ్దంలో ముస్లింలచే జయించబడిన ఖైబర్ అనే యూదుల కోటకు గుర్తుగా మిస్సైల్ పేరును ఖైబర్ మిస్సైల్ గా నామకరణం చేశారు…

ఖోరంషహర్-4 మిస్సైల్….ఇరాన్ ప్రభుత్వరంగ డిఫెన్స్ సంస్థ అయిన ఎయిరోస్పేస్ ఇండస్ట్రీస్ ఆర్గనైజేషన్ (AIO) అభివృద్ధి చేసిన లిక్విడ్ ఫ్యూయల్‌తో నడిచే మిడియం రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్.ఖోరంషహర్-4 మిస్సైల్‌ను మొదటిసారి 2017 జనవరిలో పరీక్షించారు. అదే సంవత్సరం సెప్టెంబరులో తేహ్రాన్‌లో జరిగిన మిలిటరీ పరేడ్‌లో ప్రజల ముందుకు తీసుకువచ్చారు.దీని మెరుగైన వెర్షన్ 2019 సెప్టెంబరులో తయారు చేశారు.డిఫెన్స్ నిపుణుల ప్రకారం…ఖోరంషహర్-4 మిస్సైల్ ఉత్తర కొరియాకు చెందిన హ్వాసోంగ్-10 మిడియం రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ ఆధారంగా రూపొందించబడింది. ఇది సోవియత్ యూనియన్‌లో తయారైన పాత R-27 (SS-N-6) సబ్‌మరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిస్సైల్ ఆధారంగా రూపొందించబడిన వెర్షన్.

అయితే, ఇరాన్ మిస్సైల్, ఉత్తర కొరియా ఆయుధం మధ్య కొన్ని స్పష్టమైన తేడాలు ఉన్నాయి. ఖోరంషహర్-4 క్షిపణి పొడవు 13 మీటర్లు కాగా…ఇది ఉత్తర కొరియా క్షిపణి హ్వాసోంగ్ కన్నా పెద్దది.దీనికి గ్రిడ్ ఫిన్స్‌ ఉండదు.అలాగే… గైడెన్స్ పరికరాలు ట్యాంక్‌ల పైన విడిగా ఉన్న కంపార్ట్మెంట్‌లో ఉంటాయి.

ఈ మిస్సైల్ … మాక్ 16 వేగంతో ప్రయాణించడం దీని ప్రత్యేకత. రీ-ఎంట్రీ సమయంలో మాక్ 8 వేగంతో ముందుకు దూసుకుపోతుంది.ఇది హై స్పీడ్ మిస్సైల్‌‌గా గుర్తించబడింది.అలాగే అత్యంత ప్రమాదకరమైంది.

ఇరాన్ అధికారుల ప్రకారం…

ఖోరంషహర్-4 మిస్సైల్‌ టార్గెట్ రేంజ్ 2,000 కిలోమీటర్ల ..ఇది 1,800 కిలోల బరువున్న బహుళ వార్‌హెడ్‌లను మోయగలదు. అయితే…దీని శ్రేణి 2,500 కి.మీ. వరకూ ఉండవచ్చని కొంత మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఈ మిస్సైల్ ఉన్న మరో స్పెషాలిటీ… టార్గెట్‌కు చేరుకున్న తర్వాత 80 టార్గెట్లను కొట్టగలదు. చివరి దశలో వార్‌హెడ్ విడిపోతూ లక్ష్యాల పై అత్యంత ఖచ్చితంగా విరుచుకు పడుతుంది. శత్రు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు దీన్ని గుర్తించడం…ట్రాక్ చేయడం…అడ్డుకోవడం చాలా కష్టమని నిపుణులు చెబుతున్నారు.


ఖోరంషహర్-4 మిస్సైల్ ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్‌కు చాలా ప్రమాదంగా మారుతోంది.ఇజ్రాయెల్ యొక్క “Iron Dome” వ్యవస్థ దీన్ని అడ్డుకోలేకపోతుంది. “David’s Sling” వ్యవస్థ దీన్ని అడ్డుకునే కొంత అవకాశం కలిగి ఉండవచ్చునని నిపుణులు అంటున్నారు. “Arrow Two”, “Arrow Three” లాంటి హై ఆల్టిట్యూడ్ ఇంటర్‌సెప్షన్ వ్యవస్థలు ఎక్కువగా ప్రభావితం కావొచ్చు. కానీ ఈ మిస్సైల్ నుండి విడిపడే వార్‌ హెడ్‌లను అడ్డుకోవడం మాత్రం కష్టమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఇరాన్ …ఖోరంషహర్-4 మిస్సైల్‌‌ ప్రయోగించడంతో …మిడిల్ ఈస్ట్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఖోరంషహర్-4 ప్రయోగంతో ఇరాన్ తన శక్తిని ప్రదర్శించింది.ఇరాన్ ఈ మిస్సైల్‌ను ఇజ్రాయెల్ పై ప్రయోగించడంతో ఇరు దేశాల మధ్య మరింత ఉద్రిక్తతలను పెంచింది.

పరోక్షంగా ఇరాన్… అమెరికా‌కు వార్నింగ్ ఇస్తుందా??

ఇరాన్…ఇజ్రాయెల్‌ దేశాల మధ్య ఉద్రిక్తతలకు తెర దించేందుకు అమెరికా ప్రయత్నించింది.అయితే ఇరాన్.. అమెరికా శాంతి ప్రతిపాదనను ఒప్పుకోకపోగా… అమెరికాను ఎదిరించడం మొదలు పెట్టింది.దీంతో ఇది అవమానంగా భావించిన అమెరికా… ఇజ్రాయెల్‌కు అండగా నిలబడింది.ఇజ్రాయిల్ కు మద్దతునిస్తూ.. అమెరికా ఇరాన్ పై బాంబర్స్‌తో విరుచుకుపడింది.దీంతో ఇరాన్‌…ఇజ్రాయెల్ పై క్షిపణులతో ప్రతి దాడి చేసింది.తమను అంత తేలిగ్గా తీసుకువద్దంటూ…ఇరాన్ ఇన్ డైరెక్ట్ గా అమెరికాను హెచ్చరించింది.అమెరికా ఊహించినంత బలహీన స్థితిలో ఇరాన్ లేదని సంకేతాలు పంపింది.ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే… ఇజ్రాయిల్‌కు అమెరికా అండదండగా ఉన్న … తామేమీ భయపడం లేదని …ఇటు ఇజ్రాయెల్‌ను,అటు అమెరికాకు ఇరాక్ స్పష్టమైన వార్నింగ్ ఇచ్చినట్లుగానే భావించాలంటున్నారు నిపుణులు.

Hot this week

ఇరాన్‌ను టార్గెట్ చేసిన అమెరికా !!

ఇజ్రాయెల్,ఇరాన్(ISREAL,IRAN)మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది.పరస్పరం దాడులతో రెండు...

నా వీర్యదానంతో పుట్టిన 100 మంది పిల్లలకు ఆస్తిని ఇచ్చేస్తా…

మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ (Telegram) సీఈఓ పావెల్ దురోవ్ (CEO Pavel...

సేమ్ టు సేమ్..అదే రింగ్..??

గతంలో చంద్రబాబు ధరించిన ఓ రింగ్ గురించి అప్పట్లో తీవ్ర చర్చ...

దెబ్బ తిన్న బ్లాక్ బాక్స్..దర్యాప్తు ముందుకు సాగేనా.. ??

అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన ఘోర విమాన ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి...

ఇరాన్ సుప్రీం హీరో.. వన్ అండ్ ఓన్లీ ఖమేనీని

ఇరాన్,ఇజ్రాయెల్ దేశాల మధ్య ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం… ఎటు దారి తీస్తుందోనని...

Topics

ఇరాన్‌ను టార్గెట్ చేసిన అమెరికా !!

ఇజ్రాయెల్,ఇరాన్(ISREAL,IRAN)మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది.పరస్పరం దాడులతో రెండు...

నా వీర్యదానంతో పుట్టిన 100 మంది పిల్లలకు ఆస్తిని ఇచ్చేస్తా…

మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ (Telegram) సీఈఓ పావెల్ దురోవ్ (CEO Pavel...

సేమ్ టు సేమ్..అదే రింగ్..??

గతంలో చంద్రబాబు ధరించిన ఓ రింగ్ గురించి అప్పట్లో తీవ్ర చర్చ...

దెబ్బ తిన్న బ్లాక్ బాక్స్..దర్యాప్తు ముందుకు సాగేనా.. ??

అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన ఘోర విమాన ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి...

ఇరాన్ సుప్రీం హీరో.. వన్ అండ్ ఓన్లీ ఖమేనీని

ఇరాన్,ఇజ్రాయెల్ దేశాల మధ్య ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం… ఎటు దారి తీస్తుందోనని...

AIతో..మీడియా సంస్థలకు కష్టకాలం!

ప్రపంచ దేశాల్లో లాగే భారత దేశంలో సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తోంది.ఇటీవల...

భారత నౌకాదళంలో మరో అస్త్రం….INS అర్నాలా!

భారత నౌకాదళం INS అర్నాలా‌ను, దేశంలోనే మొట్టమొదటి" షాలో వాటర్ క్రాఫ్ట్‌గా…...

ఇరాన్‌లో సోషల్ మీడియా పై ఆంక్షలు??

ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.అయితే ఇరాన్‌లో ప్రస్తుత నెలకొన్న...

Related Articles

Popular Categories