# BECAUSE EVERYONE HAS A STORY !

ఇరాన్ సుప్రీం హీరో.. వన్ అండ్ ఓన్లీ ఖమేనీని

ఇరాన్,ఇజ్రాయెల్ దేశాల మధ్య ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం… ఎటు దారి తీస్తుందోనని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే మరో వైపు అమెరికా…ఇజ్రాయెల్‌కు సపోర్ట్ చేస్తూ ఇరాన్ పరోక్షంగా వార్నింగ్ ఇస్తోంది.కానీ ఇరాన్…అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరికలకు భయపడకపోగా…డోంట్ కేర్ అంటోంది.ఇరాన్ ఇలా వ్యవహరించడం వెనుక ఓ బలమైన శక్తి ఉంది.అతనే ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని. ఖమేనీని కేవలం ఇరాన్ ఆధ్యాత్మిక నాయకుడు మాత్రమే కాదు.ఇరాన్ దేశానికి ఏకాచక్రాధిపతి అనే చెప్పుకోవాలి.86 ఏళ్ళ ఖమేనీని…ఇరాన్‌లో విదేశాంగ విధానం నుంచి ఇంధన రాజకీయాల వరకూ ప్రతి విషయంలోనూ ఆయన పాత్ర కచ్చితంగా ఉంటుంది.1989లో ఇస్లామిక్ రిపబ్లిక్ స్థాపకుడు…మొదటి సుప్రీం లీడర్ అయిన ఆయతొల్లా రుహల్లా ఖొమెయినీ మరణించిన తర్వాత ఖమేనీని ఇరాన్ దేశాన్ని పాలిస్తున్నారు.

ఇరాన్‌లో ఖమేనీని శక్తివంతమైన వ్యక్తిగా ఎలా ఎదిగాడు?….

ఖమేనీని 1939లో ఇరాన్‌లోని రెండవ పెద్ద నగరమైన మష్హద్‌లో జన్మించారు.అయన కుటుంబం మతపరమైన పండితుల వంశానికి చెందింది.…. ఖమేనీని మష్హద్‌లోని మత విద్యాసంస్థల్లో విద్యాభ్యాసం చేసి … ఆ తర్వాత పవిత్ర నగరమైన కొమ్‌కి వెళ్లారు.1962లో ఖమేనీని అప్పటి ఇరాన్ పాలకుడు షా కు వ్యతిరేకంగా రాజకీయ ఉద్యమాల్లో పాల్గొన్నారు.ఆయన ఖొమెయినీకు ముఖ్య అనుచరుడిగా ముద్ర పడింది.దీంతో చాలా సార్లు ఖమేనీని జైల్లో వేయించారని చెబుతారు.1960 చివరిలో ఖమేనీని రాజకీయంగా దుర్భరమైన జీవితం గడిపారు.అయితే షా తొలగించబడిన తర్వాత ఆయన తిరిగి ఇరాన్‌కి వచ్చారు.ఇస్లామిక్ విప్లవం తర్వాత ఖమేనీని ప్రభుత్వంలో వేగంగా ఎదిగారు.ఈ సమయానికి ఆయన ఖొమెయినీకి అత్యంత సమీపంగా ఉన్న వ్యక్తిగా మారిపోయారు.

ఖమేనీని ఇరాన్ రెవల్యూషనరీ కౌన్సిల్‌లో సభ్యుడిగా పనిచేయడంతో పాటు రక్షణ మంత్రిగా సేవలందించారు.అలాగే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు.తెహ్రాన్‌లోని ఓ మసీదులో జరిగిన బాంబు పేలుడులో ఆయన కుడి చేయి పాక్షికంగా దెబ్బతింది.ఆ తర్వాత మహమ్మద్ అలీ రాజాయీ హత్య అనంతరం ఖమేనీని అధ్యక్షుడిగా నియమితులయ్యారు.అధ్యక్షుడిగా పనిచేసే సమయంలో.. ఆయన మిర్ హొసేన్ మౌసావీతో తరచుగా విభేదించారు.మౌసావీ చాలా సంస్కరణలకు అనుకూలంగా ఉన్నారని ఖమేనీని భావించారు.1989లో ఖొమెయినీ మరణించిన తర్వాత…88 మంది సభ్యులతో “అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్”కు ఖమేనీనిని సుప్రీం లీడర్‌గా ఎన్నుకున్నారు.

ఈ సమయంలో ఖమేనీని ఆయతొల్లా హోదా పొందలేదు, అయినా రాజ్యాంగాన్ని సవరించి మరీ నియమించారు.ఇరాన్‌లో ప్రధానమంత్రి పదవిని రద్దు చేసి, ఖామెనెయికి మరింత అధికారాన్ని కట్టబెట్టారు.అప్పటి నుంచి అన్నీ తానై ఖమేనీని పరిపాలిస్తున్నాడు.ఆంటే…ఇరాన్‌లో అధ్యక్షులు మారినా,ఖమేనీని మాత్రం అధికారంలోనే కొనసాగుతూ ఇరాన్‌ను పాలిస్తున్నాడు.

ట్రంప్‌ పై ఖమేనీని ఎదురుదాడి…

ప్రస్తుతం ఇజ్రాయెల్ పైనే కాదు అన్నీ దేశాలకు పెద్దన్న పాత్రను పోషిస్తున్న ట్రంప్‌నే ఎదిరిస్తున్నాడు ఖమేనీని.ఏకంగా అమెరికాను క్యాన్సరస్ ట్యూమర్ గా అభివర్ణించాడు. ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరిస్తూనే …పరోక్షంగా ఆమెరికాకు కూడా ఖమేనీని వార్నింగ్ ఇచ్చాడు.ఇరాన్ సాయుధ దళాలు శక్తివంతమైన చర్యలు తీసుకుంటాయని.. దుష్ట జియానిస్ట్ ప్రభుత్వం మోకాళ్ల మీద కూర్చోవాల్సిందే!!అని అన్నారు.ట్రంప్ ఇరాన్‌ను లొంగిపోవాలని పిలుపునిచ్చిన ఖమేనీని పట్టించుకోలేదు.పైగా..అమెరికా ఏవైనా సైనిక చర్యలు తీసుకుంటే… తీవ్ర నష్టం చవి చూడాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించాడు.ఇరాన్ ప్రజల చరిత్రను తెలిసిన తెలివైన వ్యక్తులు… బెదిరింపులకు పాల్పడరని అన్నారు.ఇరాన్ తలవంచే దేశం కాదని ఖమేనీని అన్నారు.దీంతో ఇజ్రాయెల్,అమెరికాలను ఎదిరిస్తున్న ఖమేనీని అంతం చేయాలనే కుట్ర జరుగుతోందన్న ప్రచారం జరుగుతోంది.

ఖమేనీని తర్వాత ఇరాన్ సుప్రీం ఎవరు??…

ఇరాన్‌ సూపర్ పవర్‌గా ముద్ర పడ్డ ఖమేనీని తర్వాత ఎవరు అధికారం చేపడతారు అన్నది ఇపుడు ఓ బహిరంగ ప్రశ్నగానే మిగిలిపోయింది.ఇరాన్ మాజీ అధ్యక్షుడైన ఇబ్రాహిం రయిసి, ఒకదశలో వారసుడిగా భావించారు.అయితే, 2024 మేలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మృతి చెందాడు.దీంతో ఖమేనీని ప్రత్యామ్నాయ నాయకత్వం లేకుండా పోయింది.
ఇప్పుడు ఖమేనీని కుమారుడే వారసుడిగా అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.అయితే… ఖమేనీని లాగే ఆయన కుమారుడు కూడా బలమైన నాయకుడు కాగలడా అన్నదే ఇపుడు ఓ ప్రశ్నగా మారిపోయింది!!

Hot this week

ఇరాన్.. అమెరికాకు వార్నింగ్ ఇస్తుందా??

ఇరాన్ అణు స్థావరాల పై అమెరికా దాడులకు..ప్రతిగా ఇరాన్ ప్రతీకారానికి ...

ఇరాన్‌ను టార్గెట్ చేసిన అమెరికా !!

ఇజ్రాయెల్,ఇరాన్(ISREAL,IRAN)మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది.పరస్పరం దాడులతో రెండు...

నా వీర్యదానంతో పుట్టిన 100 మంది పిల్లలకు ఆస్తిని ఇచ్చేస్తా…

మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ (Telegram) సీఈఓ పావెల్ దురోవ్ (CEO Pavel...

సేమ్ టు సేమ్..అదే రింగ్..??

గతంలో చంద్రబాబు ధరించిన ఓ రింగ్ గురించి అప్పట్లో తీవ్ర చర్చ...

దెబ్బ తిన్న బ్లాక్ బాక్స్..దర్యాప్తు ముందుకు సాగేనా.. ??

అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన ఘోర విమాన ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి...

Topics

ఇరాన్.. అమెరికాకు వార్నింగ్ ఇస్తుందా??

ఇరాన్ అణు స్థావరాల పై అమెరికా దాడులకు..ప్రతిగా ఇరాన్ ప్రతీకారానికి ...

ఇరాన్‌ను టార్గెట్ చేసిన అమెరికా !!

ఇజ్రాయెల్,ఇరాన్(ISREAL,IRAN)మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది.పరస్పరం దాడులతో రెండు...

నా వీర్యదానంతో పుట్టిన 100 మంది పిల్లలకు ఆస్తిని ఇచ్చేస్తా…

మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ (Telegram) సీఈఓ పావెల్ దురోవ్ (CEO Pavel...

సేమ్ టు సేమ్..అదే రింగ్..??

గతంలో చంద్రబాబు ధరించిన ఓ రింగ్ గురించి అప్పట్లో తీవ్ర చర్చ...

దెబ్బ తిన్న బ్లాక్ బాక్స్..దర్యాప్తు ముందుకు సాగేనా.. ??

అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన ఘోర విమాన ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి...

AIతో..మీడియా సంస్థలకు కష్టకాలం!

ప్రపంచ దేశాల్లో లాగే భారత దేశంలో సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తోంది.ఇటీవల...

భారత నౌకాదళంలో మరో అస్త్రం….INS అర్నాలా!

భారత నౌకాదళం INS అర్నాలా‌ను, దేశంలోనే మొట్టమొదటి" షాలో వాటర్ క్రాఫ్ట్‌గా…...

ఇరాన్‌లో సోషల్ మీడియా పై ఆంక్షలు??

ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.అయితే ఇరాన్‌లో ప్రస్తుత నెలకొన్న...

Related Articles

Popular Categories