ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.అయితే ఇరాన్‌లో ప్రస్తుత నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా..సోషల్ మీడియా పై కొన్ని ఆంక్షలు విధించింది.ప్రభుత్వ ప్రసార సంస్థ… ప్రజలను వాట్సప్, టెలిగ్రామ్ ఇతర ‘లోకేషన్-ఆధారిత యాప్‌లను’ డిలీట్ చేయమని కోరింది.కారణం… మెటా సంస్థ యూజర్ డేటాను సేకరించి ఇజ్రాయెల్‌కు పంపుతోందని ఇరాన్ ఆరోపిస్తున్నారు.అందుకే ప్రజలకు సోషల్ మీడియా యాప్స్ వాడకం ఆపేయాలని కోరింది.
ఈ ఆరోపణలు నిజమేనా?….
ఇరాన్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో… సాధారణంగా కుటుంబ సభ్యులతో కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తారు.ఇందుకు WhatsApp, TELEGRAM వినియోగిస్తారు.ఈ మెసేజింగ్ యాప్‌లతో మిగతా ప్రపంచ దేశాల్లో తమ సన్నిహితులతో ఇరాన్ ప్రజలు సహజంగా కనెక్ట్ అయ్యి ఉంటారు.దీంతో ఇరానియన్ స్టేట్ టెలివిజన్ ప్రజలకు ఈ యాప్‌ను తొలగించమని హెచ్చరించింది.ఈ ప్రకటనతో టెహ్రాన్ ఇతర ప్రాంతాల్లో వాట్సప్ టెలిగ్రామ్ అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది.ఇజ్రాయెల్‌తో ఇరాన్‌కు రోజు రోజుకు పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇలాంటి పరిణామం చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే, ఇరానియన్ బలగాలు ఇజ్రాయెల్ పై Fattah-1 హైపర్‌సోనిక్ మిస్సైల్ ప్రయోగించాయి.ఇరాన్ స్టేట్ టీవీ ప్రకారం, WhatsApp యూజర్ల సమాచారాన్ని సేకరించి ఇజ్రాయెల్‌కు పంపుతోందని ఆరోపించింది. అంతే కాకుండా….Telegram లాంటి ఇతర ‘లోకేషన్ ఆధారిత యాప్‌లు’ ఉపయోగించకుండా చూడమని ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది.
ఇరాన్ ఆరోపణల పై WhatsApp స్పందన ఏమిటి??…
Meta Platformsకి చెందిన WhatsApp ఈ ఆరోపణలను ఖండించింది.ఈ తప్పుడు ఆరోపణలు ప్రజలకు అత్యవసరంగా సేవలు అవసరమైన సమయంలో వాటిని నిరోధించడానికి ఓ సాకుగా మారుతాయన్న విషయం మాకు ఆందోళన కలిగిస్తోందని మెటా అంటోంది.WhatsApp end-to-end encryption వాడుతుందని స్పష్టం చేసింది…అంటే మధ్యలో ఉన్న సర్వీసు ప్రొవైడర్‌కి మెసేజ్ చదివే అవకాశం ఉండదని మెటా క్లారిటీ ఇచ్చింది.అలాగే…తాము ఎవరి లోకేషన్‌ను ట్రాక్ చేయమని స్పష్టతనిచ్చింది. ఎవరు ఎవరికీ మెసేజ్ చేస్తున్నారన్న లాగ్‌లు ఉంచమని లేదా వ్యక్తిగత మెసేజ్‌లను ట్రాక్ చేయమని కూడా వివరణ ఇచ్చింది.తాము ఏ ప్రభుత్వానికీ గుంపుగా డేటాను ఇవ్వబోమని తెలిపింది.End-to-end encryption వల్ల మెసేజ్‌లు షిఫర్ చేయబడి, పంపిన వ్యక్తి అలాగే రిసీవ్ చేసే వ్యక్తికే చదవగలిగే అవకాశం ఉంటుందని పేర్కొంది.
మెటా ఇచ్చిన వివరణ పై నిపుణుల ఏమంటున్నారు?….
ఈ విషయంపై అనేక నిపుణులు అభిప్రాయాలు వెల్లడించారు. Cornell Universityలో అసిస్టెంట్ ప్రొఫెసర్, సైబర్ సెక్యూరిటీ నిపుణుడు గెరిగోరీ ఫాల్కో దీని పై స్పందించారు.WhatsApp యొక్క కొన్ని మెటాడేటా, అంటే ఎన్క్రిప్ట్ కాని సమాచారం, ఇప్పటికీ యాక్సెస్ చేయవచ్చు. ఇది కొంతమంది WhatsApp వాడకపోవడానికి కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.ఒక దేశానికి చెందిన WhatsApp డేటా ఆ దేశంలోనే ఉంచాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు, ఇరాన్‌కు సంబంధించిన WhatsApp డేటా ఇరాన్‌లోనే నిల్వ చేయాలి. “ప్రపంచ డేటా నెట్‌వర్క్ పై నమ్మకం ఉంచడం కష్టమవుతోంది. కాబట్టి దేశాలు తమ డేటాను దేశంలోనే నిల్వ చేయాలి మరియు ప్రాసెస్ చేయాలి,” అని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
WhatsAppను ఇరాన్ ముందు ఎందుకు నిషేధించింది?….
ఇంతకుముందు, 2022లో మహ్సా అమినీ అనే యువతి మోరాలిటీ పోలీస్ కస్టడీలో మరణించడంతో ఇరాన్ WhatsApp అలాగే ఇతర సోషల్ మీడియా యాప్‌లను నిషేధించింది.అప్పట్లో, Google Play Store కూడా బ్లాక్ చేయబడింది.WhatsApp, Telegram మరియు Instagram ప్రజల్లో అత్యంత ప్రజాదరణ పొందిన యాప్‌లు.2023 చివర్లో కొన్ని నిషేధాలు తొలగించినప్పటికి…ఇప్పటికీ ఈ యాప్‌లు వాడడానికి VPNలు లేదా ప్రాక్సీలు అవసరమని నిపుణులు చెబుతున్నారు.