# BECAUSE EVERYONE HAS A STORY !

దెబ్బ తిన్న బ్లాక్ బాక్స్..దర్యాప్తు ముందుకు సాగేనా.. ??

అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన ఘోర విమాన ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయిన ఎయిరిండియా విమానం కొన్ని క్షణాల్లోనే కుప్పకూలింది.ఈ విమానానికి సంబంధించిన అత్యంత కీలకమైన బ్లాక్ బాక్స్ ప్రమాదంలో దెబ్బ తిన్నట్లు తెలుస్తోంది.బ్లాక్ బాక్స్ డేటాను విశ్లేషించేందుకు…దాన్ని విదేశాలకు పంపించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు.ప్రమాదం జరిగిన బీజే వైద్య కళాశాల భవనం పై నుంచి అధికారులు బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.అయితే తాజాగా ప్రమాద సమయంలో అది దెబ్బతిన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.దీంతో దాని నుంచి మెరుగైన సమాచారం రాబట్టేందుకు అమెరికాలోని వాషింగ్టన్ డీసీలోని జాతీయ రవాణా భద్రతా బోర్డుకు పంపే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి.యూఎస్‌కు పంపే సమయంలో ప్రొటోకాల్స్ పాటించడంతో పాటు భారత్‌కు చెందిన అధికారుల బృందం కూడా బ్లాక్ బాక్స్‌తో పాటు వెళ్తుందని తెలుస్తోంది. విమాన ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు బ్లాక్ బాక్స్ సమాచారం ఎంతో కీలకం.దీంతో కేంద్రం ప్రభుత్వం ఓ ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.బ్లాక్ బాక్స్‌లోని సమాచారాన్ని రాబట్టేందుకు కేంద్రం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది.

బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి…
దర్యాప్తుకు బ్లాక్ బాక్స్ కీలకం కానుందా??

ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఉన్న బ్లాక్ బాక్స్‌లను కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (CVR)అలాగే ఫ్లైట్ డేటా రికార్డర్ (FDR) కలిపి ఏర్పాటు చేస్తారు.అనుకోకుండా జరిగే విమాన ప్రమాదాల డేటాను రికార్డ్ చేసే వీటిని “యాక్సిడెంట్ డేటా రికార్డర్లు” అని కూడా పిలుస్తారు. FDRలు ఎత్తు, వేగం, ఎంజిన్ పనితీరు, ఇంధనం, గాలీ ప్రభావం, ఆటోపైలట్ స్టేటస్ వంటి అనేక పారామీటర్లను స్టోర్ చేస్తాయి. CVRలు పైలట్ల మధ్య సంభాషణలు, రేడియో కమ్యూనికేషన్స్, ఇంజిన్ శబ్దాలు, ఇతర శబ్దాలు, గేర్ వేయడం మరియు లాగడం, అలారమ్ శబ్దాలను రికార్డ్ చేస్తాయి.

బ్లాక్ బాక్స్‌లు సాధారణంగా నారింజ రంగులో ఉంటాయి.ప్రమాదంలో శిధిలాల్లో వీటిని తేలికగా గుర్తించడానికి నారింజ రంగును వాడతారు.అన్ని కమర్షియల్ విమానాల్లో ఇవి తప్పనిసరిగా ఉంటాయి.ఈ రెండు రికార్డర్లు… ప్రమాదానికి దారితీసిన కారణాలను గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

CVRలు పైలట్ల మైకులు, హెడ్సెట్‌లు, కాక్‌పిట్ మధ్య భాగంలోని మైక్‌ల నుండి ఆడియో రికార్డ్ చేస్తాయి. ఇవి రెండు గంటల వరకు ఆడియోను స్టోర్ చేయగలవు, ఇక FDRలు 25 గంటల వరకు ఫ్లైట్ డేటాను స్టోర్ చేయగలవు. బ్లాక్ బాక్స్‌ల బరువు సుమారు 4.5 కిలోలుగా ఉండి, విమానం ప్రమాదానికి గురైందని అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి.

బ్లాక్ బాక్స్‌లు నాశనం అయ్యే అవకాశముందా?….

బ్లాక్ బాక్స్‌లు సాధారణంగా విమానపు వెనుక భాగమైన తోక భాగంలో అమర్చుతారు.ఎందుకంటే….ప్రమాదాల్లో వెనుక భాగం తక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది.FDR మరియు CVRలను టిటానియం లేదా స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేసిన బాక్స్‌లో ఉంచుతారు. ఇవి మంటలు మరియు వేడి నుండి రక్షణ కలిగించే ఇన్సులేషన్‌తో కప్పబడి ఉంటాయి.బ్లాక్ బాక్స్ 1093°C ఉష్ణోగ్రతను గంట పాటు తట్టుకోగలదు.

FDRలు సముద్రంలో 6,000 మీటర్ల లోతులో కూడా విధ్వంసం అవ్వకుండా డిజైన్ చేయబడ్డాయి. నీటిలో మునిగితే వీటిలో ఉన్న బీకాన్ 30 రోజులపాటు అల్ట్రాసోనిక్ సంకేతాలను ప్రసారం చేస్తుంది.దీని బ్యాటరీ లైఫ్ 6 సంవత్సరాలకు పైగా ఉంటుంది. ఇది 14,000 అడుగుల లోతు వరకు శబ్దాలను ప్రసారం చేసి సోనార్ సిస్టమ్ ద్వారా గుర్తించబడుతుంది.

బ్లాక్ బాక్స్‌లు ఎలా పనిచేస్తాయంటే…??

డేటా “stacked memory boards” అనే ప్రత్యేక యూనిట్స్‌లో స్టోర్ చేయబడుతుంది.దీనిని CSMU (Crash Survivable Memory Unit) అంటారు.ఇది తీవ్రమైన వేడి, ప్రమాదాల నుంచి డేటాను కాపాడుతుంది.బ్లాక్ బాక్స్ పూర్తిగా నాశనం కావడం చాలా అరుదు అని లీహామ్ కంపెనీకి చెందిన ఏవియేషన్ నిపుణుడు స్కాట్ హామిల్టన్ NPRకి చెబుతున్నారు.ఏదో కొన్ని సందర్భాల్లో తప్ప బ్లాక్ బాక్స్ వర్క్ చేయకుండా ఉండే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు.అయితే, కొన్ని సందర్భాల్లో బ్లాక్ బాక్స్‌లు పనిచేయని సందర్భాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.జనవరిలో దక్షిణ కొరియాలో జెజు ఎయిర్ విమాన ప్రమాదంలో బ్లాక్ బాక్స్‌లు నాలుగు నిమిషాల ముందు పని చేయడం ఆపేశాయి. ఇదే విధంగా, 9/11 సమయంలో జరిగిన 4 విమాన హైజాక్‌లలోనూ 8 బ్లాక్ బాక్స్‌ల గురించి ఇలాంటి సమస్యే ఉత్పన్నమైంది.

భారత్ బ్లాక్ బాక్స్‌ను అమెరికాకు పంపిస్తుందా?…

ఇండియా ఈ బ్లాక్ బాక్స్‌ను అమెరికాలోని నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) ల్యాబ్‌కు పంపే అవకాశం ఉంది. విమానం దగ్ధమైందని, బ్లాక్ బాక్స్ పూర్తిగా దెబ్బతిన్నదని… ఈ డేటాను ఇండియాలోనే ఎనలైజ్ చేయడం కష్టమని నిపుణులు చెబుతున్నారు.

మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిర్ణయం తీసుకుంటుంది. అమెరికాకు పంపితే, భారత అధికారులు కూడా ఆ బాక్స్‌తో పాటు వెళ్తారు. AAIB డిల్లీలో ల్యాబ్ ఏర్పాటు చేసినా, ఇంకా పూర్తిగా డామేజ్ అయిన రికార్డర్లను హ్యాండిల్ చేసే సామర్థ్యం లేదని అధికారులు చెబుతున్నారు.అందుకే NTSB వీటిని తమ ల్యాబ్‌కు తీసుకెళ్తుందని వెల్లడించారు.బ్లాక్ బాక్స్‌ను అమెరికా తీసుకెళ్ళే సమయంలో అన్ని ప్రోటోకాల్స్ ఇండియన్ అధికారులు కూడా ఫాలో అవుతారు.బ్లాక్ బాక్స్ డేటా‌ను సేకరించేందుకు రెండు రోజుల నుంచి కొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉంది. డేటా డామేజ్ కాకుండా మెమరీ బోర్డ్ తీసి, ఎలక్ట్రానిక్ సర్క్యూట్‌లో నష్టం ఉందా లేదా అన్నది చెక్ చేస్తే…డేటా ఎంతవరకు రికవరీ చేయవచ్చో తెలిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Hot this week

ఇరాన్.. అమెరికాకు వార్నింగ్ ఇస్తుందా??

ఇరాన్ అణు స్థావరాల పై అమెరికా దాడులకు..ప్రతిగా ఇరాన్ ప్రతీకారానికి ...

ఇరాన్‌ను టార్గెట్ చేసిన అమెరికా !!

ఇజ్రాయెల్,ఇరాన్(ISREAL,IRAN)మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది.పరస్పరం దాడులతో రెండు...

నా వీర్యదానంతో పుట్టిన 100 మంది పిల్లలకు ఆస్తిని ఇచ్చేస్తా…

మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ (Telegram) సీఈఓ పావెల్ దురోవ్ (CEO Pavel...

సేమ్ టు సేమ్..అదే రింగ్..??

గతంలో చంద్రబాబు ధరించిన ఓ రింగ్ గురించి అప్పట్లో తీవ్ర చర్చ...

ఇరాన్ సుప్రీం హీరో.. వన్ అండ్ ఓన్లీ ఖమేనీని

ఇరాన్,ఇజ్రాయెల్ దేశాల మధ్య ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం… ఎటు దారి తీస్తుందోనని...

Topics

ఇరాన్.. అమెరికాకు వార్నింగ్ ఇస్తుందా??

ఇరాన్ అణు స్థావరాల పై అమెరికా దాడులకు..ప్రతిగా ఇరాన్ ప్రతీకారానికి ...

ఇరాన్‌ను టార్గెట్ చేసిన అమెరికా !!

ఇజ్రాయెల్,ఇరాన్(ISREAL,IRAN)మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది.పరస్పరం దాడులతో రెండు...

నా వీర్యదానంతో పుట్టిన 100 మంది పిల్లలకు ఆస్తిని ఇచ్చేస్తా…

మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ (Telegram) సీఈఓ పావెల్ దురోవ్ (CEO Pavel...

సేమ్ టు సేమ్..అదే రింగ్..??

గతంలో చంద్రబాబు ధరించిన ఓ రింగ్ గురించి అప్పట్లో తీవ్ర చర్చ...

ఇరాన్ సుప్రీం హీరో.. వన్ అండ్ ఓన్లీ ఖమేనీని

ఇరాన్,ఇజ్రాయెల్ దేశాల మధ్య ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం… ఎటు దారి తీస్తుందోనని...

AIతో..మీడియా సంస్థలకు కష్టకాలం!

ప్రపంచ దేశాల్లో లాగే భారత దేశంలో సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తోంది.ఇటీవల...

భారత నౌకాదళంలో మరో అస్త్రం….INS అర్నాలా!

భారత నౌకాదళం INS అర్నాలా‌ను, దేశంలోనే మొట్టమొదటి" షాలో వాటర్ క్రాఫ్ట్‌గా…...

ఇరాన్‌లో సోషల్ మీడియా పై ఆంక్షలు??

ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.అయితే ఇరాన్‌లో ప్రస్తుత నెలకొన్న...

Related Articles

Popular Categories