భారత నౌకాదళం INS అర్నాలాను, దేశంలోనే మొట్టమొదటి” షాలో వాటర్ క్రాఫ్ట్‌గా… విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో అధికారికంగా లాంచ్ చేసింది.77 మీటర్ల పొడవు ఉన్న అర్నాలాను దేశీయంగా రూపొందించారు .ఇది నౌక భారత తీర భద్రత సామర్థ్యాన్ని పెంచనుంది.ఈ నౌకకు మహారాష్ట్రలోని ప్రసిద్ధ అర్నాలా కోటకు గౌరవ సూచకంగా అర్నాలా అనే పేరు పెట్టారు.
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నౌకాశ్రయంలో జరిగిన ఈ కమిషనింగ్ కార్యక్రమానికి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ అధ్యక్షత వహించారు.భవిష్యత్తులో ఈ నౌక భారత తీర ప్రాంతాల రక్షణకు పెద్ద దిక్సూచి కానుంది.
INS అర్నాలా విశేషాలు….
INS అర్నాలా పొడవు 77 మీటర్లు బరువు (డిస్ప్లేస్‌మెంట్)..1,490 టన్నులు
అర్నాలాను…కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ (GRSE) రూపొందించి నిర్మించింది. ఈ ప్రాజెక్టు L&T)తో ఉన్న పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంలో రూపోదించబడింది.ఈ నౌక డీజిల్ ఇంజిన్–వాటర్‌జెట్ ప్రొపల్షన్ సిస్టమ్ ద్వారా నడుస్తుంది.అలాగే ఇది తక్కువ లోతు సముద్రాల్లో వేగంగా కదలికకు వీలుగా ఉంటుంది. ఇది ఇప్పటివరకు నిర్మించిన నౌకల్లో… అతిపెద్ద భారతీయ నౌక.భారత రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం… ఈ నౌక గూఢచర్యం,రక్షణ కార్యకలాపాలకు ఉపయోగించేందుకు రూపోందించబడింది. అలాగే తక్కువ స్థాయి నౌకా కార్యాచరణలు కోసం నిర్మించబడింది.అంతే కాకుండా, INS అర్నాలా… GRSE కంపెనీ స్వతహాగా డిజైన్ చేసిన తొలి నౌక. ఇప్పటివరకు భారత నౌకాదళం డిజైన్‌ను అందించేది.ఈ నౌకలో 80 శాతం పైగా దేశీయంగా తయారైన పరికరాలు ఉండటం ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని బలోపేతం చేస్తుంది.ఉన్నతమైన దేశీయ వ్యవస్థలు INS అర్నాలా నిర్మాణంలో భారతదేశంలోని ప్రముఖ రక్షణ సంస్థలు ఇందులో భాగస్వాములయ్యాయి:
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)
లార్సెన్ అండ్ టుబ్రో (L&T)
మహీంద్రా డిఫెన్స్, MEIL
ఈ నౌకను అబాయ్ క్లాస్ కార్వెట్స్‌ను బదులుగా తీసుకొచ్చారు.INS అర్నాలా 8 ASW–SWC నౌకల శ్రేణిలో ఫస్ట్ ప్లేస్‌లో నిలుస్తుంది. వీటిని GRSE నిర్మిస్తోంది. మిగిలిన 8 నౌకలను కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ రూపొందించి నిర్మించనుంది.ఈ ఏడాది చివరిలో రెండవ నౌకను కూడా నేవీలో చేర్చే అవకాశం ఉంది. అంతేకాదు, మొత్తం 16 నౌకలను 16 ప్రధాన పోర్టులకు రక్షణగా నియమించనున్నారు.
తీరరక్షణలో INS అర్నాలా ప్రాముఖ్యత ఏంటి..??
INS అర్నాలా భారత తీర భద్రతకు ఒక పెద్ద మైలురాయిగా నిలుస్తోంది. దీని ప్రధాన పాత్ర శత్రు సబ్‌మరీన్‌ల నుండి రక్షణ కల్పించడం. అంతేకాకుండా, ఈ నౌక అంతర్జల గూఢచర్య వ్యవస్థలు, మైన్‌లేయింగ్ సామర్థ్యం వంటి అత్యాధునిక సాంకేతికతను కలిగి ఉంది. ఇది తక్కువ లోతు జలాల్లో అత్యుత్తమంగా పని చేస్తుంది.నౌకాదళ వర్గాల ప్రకారం, శత్రుదేశాల సబ్‌మరీన్‌లు 50–60 మీటర్ల లోతు ఉన్న తీర ప్రాంతాల్లో టార్గెట్లను ఎంచుకునే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్ధితుల్లో, INS అర్నాలా అలాంటి సబ్‌మరీన్‌లను గుర్తించడానికి, ట్రాక్ చేయడానికి,అలాగే దీటుగా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉంటుంది.ఫ్రిగేట్లు మరియు డిస్ట్రాయర్లు ASW సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ… ఎక్కువగా యుద్ధ కార్యాచరణకు ఉపయోగించే అవకాశం ఉంది.కానీ అర్నాలా తరహా నౌకలు తీరరక్షణకు, ప్రత్యేకంగా సబ్‌మరీన్‌లను గుర్తించేందుకు రూపొందించింది.
ఆత్మనిర్భర్ నావికా శక్తికి మరో ముందడుగు….
INS అర్నాలా కమిషన్ కావడం భారత నౌకాదళానికి ఓ సరికొత్త మార్పు .ఇది భారతదేశానికి తీర రక్షణలో విశ్వసనీయతను పెంచుతుంది. అలాగే భారత మహాసముద్ర ప్రాంతంలో దేశానికి స్వయం ఆధారిత నౌకా శక్తిగా గుర్తింపు తీసుకురావడంలో INS అర్నాలా కీలకపాత్ర పోషించనుంది.INS అర్నాలాలో అధునాతన సెన్సార్లు, అండర్‌వాటర్ అకౌస్టిక్ కమ్యూనికేషన్ సిస్టమ్ (UWACS), లో ఫ్రిక్వెన్సీ వేరియబుల్ డెప్త్ సోనార్ (LFVDS) వంటి వ్యవస్థలు ఉన్నాయి. దీని వేరియబుల్ డెప్త్ సోనార్ వ్యవస్థను భారతదేశంలోని CFF ఫ్లూయిడ్ కంట్రోల్ లిమిటెడ్,జర్మనీలోని అట్లాస్ ఎలెక్ట్రోనిక్స్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.ఈ నౌకా యుద్ధనౌక భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక పాత్ర పోషించనుంది. శత్రుదేశాల వద్ద ఆధునిక నౌకా వ్యవస్థలు లేకపోవడం వల్ల, పాకిస్తాన్ సబ్‌మరీన్‌ల పై ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది.అలాంటి సమయంలో, INS అర్నాలా తరహా నౌకలు భారత తీర ప్రాంతాలను కాపాడటంలో కీలకంగా మారతాయి.