# BECAUSE EVERYONE HAS A STORY !

AIతో..మీడియా సంస్థలకు కష్టకాలం!

ప్రపంచ దేశాల్లో లాగే భారత దేశంలో సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తోంది.ఇటీవల కాలంలో అన్ని వర్గాల ప్రజలు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు.ఎక్కువ మంది భారతీయులు వార్తల కోసం సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పై ఆధారపడుతున్నారని ఓ సర్వే రిపోర్ట్ చెబుతోంది.2025 డిజిటల్ న్యూస్ రిపోర్ట్ ప్రకారం..ముఖ్యంగా యూత్ వీడియోలు,సోషల్ మీడియాను ఇష్టపడుతున్నారు.అందుకే ఏఐ వినియోగం బాగా పెరిగిందని ఆ సంస్థ చేసిన సర్వే‌లో తేలింది.48 దేశాలలో ఒక లక్ష మంది పై నిర్వహించిన సర్వే ఆధారంగా రూపొందిన ఈ రిపోర్ట్… భారత్‌లో ముఖ్యమైన మార్పులను హైలైట్ చేస్తుంది.

ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్న ఇంగ్లీష్ మాట్లాడే భారతీయులలో 50 శాతానికి పైగా న్యూస్ చూడరని రిపోర్ట్ చెబుతోంది.అందుకే టీవీ, పత్రికలు,న్యూస్ వెబ్‌సైట్లు పై ఆసక్తి తగ్గుతోందని…అదే సమయంలో YouTube,న్యూస్ అగ్రిగేటర్‌ల వాడకం పెరుగుతోందని తెలుస్తోంది.సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు దాదాపుగా అందరూ న్యూస్ ప్రజెంట్ చేస్తున్నారని తేలింది.ముఖ్యంగా యువత…కంటెంట్ క్రియేటర్లు‌గా YouTube అలాగే Instagramలో కనిపిస్తారు.వారికి పెద్ద సంఖ్యలో ఫాలోయింగ్ కూడా ఉంది.ప్రపంచవ్యాప్తంగా Joe Rogan HugoDécrypte వంటి క్రియేటర్లు మిలియన్ల మందికి చేరుతున్నారు. భారతదేశం, థాయిలాండ్, కెన్యా ఫిలిప్పీన్స్ వంటి దేశాలలో చదవడం కంటే వీడియోలు చూసేందుకు ఇష్టపడుతున్నారు.

సర్వే రిపోర్ట్ ప్రకారం…18–34 ఏళ్ల వయస్సు గల 41 శాతం మంది వ్యక్తులు సోషల్ మీడియా, YouTubeని తమ ప్రధాన వార్తా వనరుగా ఉపయోగిస్తున్నారు. అదే వయస్సు గల వారిలో కేవలం 24 శాతం మాత్రమే పబ్లిషర్ వెబ్‌సైట్లను చూస్తున్నారు. ఈ మార్పు వల్ల వార్తా సంస్థలు… తమ వీక్షకులను ఎలా చేరుకోవాలో అర్థం కాని పరిస్థితులు ఏర్పడుతున్నాయి.ప్రసుత్తం న్యూస్ ఛానల్స్ అన్ని ఈ పరిస్థితిని పునరాలోచించుకోవాలని సర్వే రిపోర్ట్ చెబుతోంది.ఈ రిపోర్ట్‌తో పాటు, ChatGPT మరియు Perplexity AI వంటి AI చాట్‌బాట్‌లు వార్తలను సరళంగా చాలా సులభంగా అందిస్తుండటంతో ప్రజాదరణ పొందుతున్నాయి.భారతదేశంలో ఈ టూల్స్ వ్యక్తిగత వార్తల కోసం ఎక్కువగా ఉపయోగించబడుతున్నాయి.44 శాతం మంది AIను దీనికోసం ఉపయోగించడంలో సౌకర్యంగా ఉందని భావిస్తున్నారు. దాదాపు ప్రతి ఐదుగురిలో ఒకరు ప్రతి వారం AI చాట్‌బాట్ ద్వారా వార్తలను పొందుతున్నారని తెలుస్తోంది.

చాలా దేశాల్లో WhatsApp తక్కువ ప్రమాదకరమైన ప్లాట్‌ఫార్మ్‌గా కనిపించినా…. ఇండియాలో మాత్రం అందుకు మినహాయింపు. ఈ యాప్‌లో పెద్ద గ్రూప్ చాట్స్ ఫేక్ న్యూస్ వ్యాప్తికి దారితీస్తున్నాయని… కొన్ని సందర్భాల్లో అల్లర్లకు దారి తీసిన సందర్భాలు ఉన్నాయని రిపోర్ట్‌లో తేలింది.భారతీయ వినియోగదారులలో సుమారు 11 శాతం మంది…. స్నేహితులు కుటుంబ సభ్యులు కూడా తప్పుదారి పట్టించే సమాచారాన్ని పంచుకుంటారని డిజిటల్ న్యూస్ రిపోర్ట్ తేల్చింది.

Hot this week

ఇరాన్.. అమెరికాకు వార్నింగ్ ఇస్తుందా??

ఇరాన్ అణు స్థావరాల పై అమెరికా దాడులకు..ప్రతిగా ఇరాన్ ప్రతీకారానికి ...

ఇరాన్‌ను టార్గెట్ చేసిన అమెరికా !!

ఇజ్రాయెల్,ఇరాన్(ISREAL,IRAN)మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది.పరస్పరం దాడులతో రెండు...

నా వీర్యదానంతో పుట్టిన 100 మంది పిల్లలకు ఆస్తిని ఇచ్చేస్తా…

మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ (Telegram) సీఈఓ పావెల్ దురోవ్ (CEO Pavel...

సేమ్ టు సేమ్..అదే రింగ్..??

గతంలో చంద్రబాబు ధరించిన ఓ రింగ్ గురించి అప్పట్లో తీవ్ర చర్చ...

దెబ్బ తిన్న బ్లాక్ బాక్స్..దర్యాప్తు ముందుకు సాగేనా.. ??

అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన ఘోర విమాన ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి...

Topics

ఇరాన్.. అమెరికాకు వార్నింగ్ ఇస్తుందా??

ఇరాన్ అణు స్థావరాల పై అమెరికా దాడులకు..ప్రతిగా ఇరాన్ ప్రతీకారానికి ...

ఇరాన్‌ను టార్గెట్ చేసిన అమెరికా !!

ఇజ్రాయెల్,ఇరాన్(ISREAL,IRAN)మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది.పరస్పరం దాడులతో రెండు...

నా వీర్యదానంతో పుట్టిన 100 మంది పిల్లలకు ఆస్తిని ఇచ్చేస్తా…

మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ (Telegram) సీఈఓ పావెల్ దురోవ్ (CEO Pavel...

సేమ్ టు సేమ్..అదే రింగ్..??

గతంలో చంద్రబాబు ధరించిన ఓ రింగ్ గురించి అప్పట్లో తీవ్ర చర్చ...

దెబ్బ తిన్న బ్లాక్ బాక్స్..దర్యాప్తు ముందుకు సాగేనా.. ??

అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన ఘోర విమాన ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి...

ఇరాన్ సుప్రీం హీరో.. వన్ అండ్ ఓన్లీ ఖమేనీని

ఇరాన్,ఇజ్రాయెల్ దేశాల మధ్య ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం… ఎటు దారి తీస్తుందోనని...

భారత నౌకాదళంలో మరో అస్త్రం….INS అర్నాలా!

భారత నౌకాదళం INS అర్నాలా‌ను, దేశంలోనే మొట్టమొదటి" షాలో వాటర్ క్రాఫ్ట్‌గా…...

ఇరాన్‌లో సోషల్ మీడియా పై ఆంక్షలు??

ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.అయితే ఇరాన్‌లో ప్రస్తుత నెలకొన్న...

Related Articles

Popular Categories